
ముంబై, 12 నవంబర్ (హి.స.)బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ షాకిస్తున్నాయి. క్రమంగా పెరుగుతూ వస్తోంది. గతంలో లక్షా 30 వేల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. లక్షా 20 వేల దిగువన చేరుకుంది. కానీ మెల్లమెల్లగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మూడు రోజుల్లోనే కనీసం 2 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం నవంబర్ 12వ తేదీన దేశంలో తులం బంగారం ధర రూ.1,25,850 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,650 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,010 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,15,360 ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV