
ఢిల్లీ, 12 నవంబర్ (హి.స.)
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న హ్యుందాయ్ i20 కారు బ్లాస్ట్ జరిగిన ప్రాంతంలో కేంద్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు కన్పిస్తోంది. ఇవాళ (బుధవారం) ఉదయం అక్కడి దృశ్యాలు మరింత భద్రతా కవచాన్ని తలపిస్తున్నాయి. భారీ సంఖ్యలో సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నారు. ఎర్రకోటకు వెళ్లే ప్రధాన మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయగా, వాహనాల తనిఖీలు కట్టుదిట్టం చేశారు. పేలుడు ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించారు. సీసీటీవీ ఫుటేజీల విశ్లేషణతో పాటు పేలుడు పదార్థాల మూలం కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పౌరుల భద్రత కోసం పోలీస్ అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV