
యాదాద్రి భువనగిరి, 14 నవంబర్ (హి.స.) యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం మార్నింగ్ వాక్ నిర్వాహించారు. తన స్వగృహం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాతగుట్ట ఆలయం వరకు వాక్ చేస్తూ స్థానిక ప్రజలను కలిశారు. తాజాగా పాతగుట్ట వరకు రోడ్డు పనులను ప్రారంభించగా రోడ్డు వెడల్పు, పలు అంశాలను, సమస్యలను బీర్ల ఐలయ్య తెలుసుకున్నారు. పలు సమస్యలను అధికారులకు తెలిపి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలంతా రోడ్డు వెడల్పులో సహకరించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు