
పాట్నా, 14 నవంబర్ (హి.స.) బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే, బీహార్ ఓటింగ్కు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన జోస్యం నిజమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా బీహార్ లో గెలువబోయే స్థానాల గురించి అంచనా వేవారు. ఎన్డీయే 160కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. ఇప్పుడు ఆయన అంచనాలే నిజమవుతున్నాయి. నిజం చెప్పాలంటే అమిత్ షా అంచనాలను మించి ఎన్డీయే కూటమి ప్రదర్శన చేసింది. ఆ సమావేశంలో జేడీయూ, బీజేపీల మధ్య విభేదాలను కూడా ఆయన తోసిపుచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..