అలర్ట్.. శంషాబాద్లో రెండు విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు..
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర
బాంబు బెదిరింపు


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

ఒకేసారి రెండు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. అబుదాబి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.దీంతో ఇండిగో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు అధికారులు. లండన్ నుంచి వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాన్ని సమయాని కన్నా ముందుగానే అత్యవసర ల్యాండింగ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ అయినా బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానంలో నుంచి ప్రయాణికులను త్వరగా దింపేశారు. విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ సెంటర్ కి తరలించి బాంబ్స్ స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్లతో. సిఐఎస్ఎఫ్ బలగాలు.. తనిఖీలు నిర్వహిస్తున్నాయి

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande