బీహార్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్ డి ఏ.. సంబరాలు షురూ..
పాట్నా, 14 నవంబర్ (హి.స.) బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. పోస్టల్ కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి ముందంజలో కొనసాగింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాట
బీహార్ రిజల్ట్స్


పాట్నా, 14 నవంబర్ (హి.స.)

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. పోస్టల్ కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి ముందంజలో కొనసాగింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుకుని దూసుకుపోతుంది. ప్రస్తుతం 130 స్థానాల్లో జేడీయూ-బీజేపీ కూటమి ముందంజలో ఉంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు రావాలి. ప్రస్తుతం ఈ సంఖ్యను దాటుకుని 149 స్థానాల్లో అధికార కూటమి దూసుకెళ్తాంది. దీంతో బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విపక్ష కూటమి 68 స్థానాల్లో కొనసాగుతోంది.

సర్వేలు చెప్పినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తాంది. మహాఘట్బంధన్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కన్నారు. కానీ ఆశలు గల్లంతయ్యాయి. పూర్తి వెనుకంజలో ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande