మా పార్టీ బలహీనంగా ఉంది.. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం.. కిషన్ రెడ్డి
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ

కార్పొరేటర్ కూడా గెలవలేదు.. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని.. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని.. తమ పార్టీ అక్కడ బలహీనంగా ఉందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామని తెలిపారు. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదన్నారు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం.. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలని ప్రశ్నించారు. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదన్నారు. దీనిపై తాము ఫిర్యాదు చేస్తామని.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టామన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీలో అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదని గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande