పేద ప్రజల సొంతింటి కల నెరవేరింది: ఎమ్మెల్యే యాదయ్య
రంగారెడ్డి, 14 నవంబర్ (హి.స.) పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం లోని గుండాల గ్రామంలో అదే గ్రామానికి చెందిన మంగళి లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇల్లు ను శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సం
చేవెళ్ల ఎమ్మెల్యే


రంగారెడ్డి, 14 నవంబర్ (హి.స.)

పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం లోని గుండాల గ్రామంలో అదే గ్రామానికి చెందిన మంగళి లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇల్లు ను శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంత ఇంటి కల నెరవేరింది అన్నారు. నియోజకవర్గంలోనే మొట్టమొదటి ఇల్లు గుండాల గ్రామంలో ప్రారంభించామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande