జవహర్ లాల్ నెహ్రు స్పూర్తితో పాఠశాల విద్యారంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం..సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ తొలి ప్రధాన మంత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి (నవంబర్ 14) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయుడిని స్మరించుకున్నారు. నెహ్రు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే
సిఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ తొలి ప్రధాన మంత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రు జయంతి (నవంబర్ 14) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయుడిని స్మరించుకున్నారు. నెహ్రు జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని బాల బాలికలందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారు. బాలలను జాతి సంపదగా భావించి వారి మెరుగైన భవితవ్యానికి కృషి చేయాలన్న నెహ్రు ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్న జవహర్ లాల్ నెహ్రు స్పూర్తితో ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. చదువుతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడంలో ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande