సూసైడ్ బాంబర్ ఉమర్ నబీ ఇంటిని కూల్చివేసిన భద్రతా సిబ్బంది..
న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.) ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని ఇవాళ భద్రతా దళాలు కూల్చివేశాయి. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న ఆ ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గురువారం అర
సూసైడ్ బాంబర్ ఉమర్


న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని ఇవాళ భద్రతా దళాలు కూల్చివేశాయి. కశ్మీర్లోని పుల్వామాలో ఉన్న ఆ ఇంటిని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. పేలుడు పదార్ధాలు దాచేందుకు ఆ ఇంటి ఉమర్ నబీ వాడుకున్నట్లు గుర్తించారు. ఉగ్రకార్యకలాపాలకు మద్దతు ఇచ్చే వారికి ఇలాంటి శిక్షే ఉంటుందన్న ఉద్దేశాన్ని తెలిపేందుకు ఉమర్ నబీ ఇంటిని పేల్చివేశారు. భారత భూభాగంపై ఉగ్రకార్యకలాపాలకు చోటు లేదన్న సంకేతాన్ని వినిపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande