
చెన్నై 14 నవంబర్ (హి.స.)
, :ఆంధ్ర నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం పెరంబూరు రైల్వేస్టేషన్‌లో ఓ యువక్చుడు రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని గమనించిన ఎక్సైజ్ పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద బ్యాగుల్లో గంజాయి బయల్పడడంతో స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశారు. అతన్ని కడలూరు జిల్లాకు చెందిన జీవేంద్రన్ (24)గా గుర్తించారు. మొత్తం 4.5 కిలోల గంజాయి పట్టుపడినట్ట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ