అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
ముంబై, 14 నవంబర్ (హి.స.)బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం 10 గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.800 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10
gold


ముంబై, 14 నవంబర్ (హి.స.)బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం 10 గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.800 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై అతి స్వల్పంగా అంటే వంద రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.1,73,100 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, నిన్న వెండి ధర భారీ స్థాయిలో పెరిగింది. ఏకంగా 10 వేల రూపాయల వరకు ఎగబాకింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో తులం బంగారంపై 800 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ఇతర ధర కొనసాగుతోంది. ఇక ఢిల్లీలోనూ తులం బంగారం ధర రూ.1,28,000 ఉండగా, అదే ముంబైలో రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande