నవీన్ యాదవ్ ఇంటివద్ద మొదలైన గెలుపు సంబురాలు
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్యే అసలు పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు 6 రౌండ్లు పూర్తి కాగా.. అన్ని రౌ
నవీన్ యాదవ్


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు

ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్యే అసలు పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు 6 రౌండ్లు పూర్తి కాగా.. అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన 6 రౌండ్ల కౌంటింగ్ లో కాంగ్రెస్ 15080 ఓట్లతో దూసుకుపోతోంది. దీంతో జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ ఇంటివద్ద, పార్టీ ఆఫీసు వద్ద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటివద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. గెలుపు లాంఛనప్రాయం కావడంతో సంబురాలు కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక నవీన్ యాదవ్ ఇంటివద్ద అప్పుడే బాణాసంచా కాలుస్తూ.. సందడి చేస్తున్నారు కార్యకర్తలు, అభిమానులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande