సమాజంలో కుల సంఘాల పాత్ర ముఖ్యమైనది.. కామారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి, 14 నవంబర్ (హి.స.) కుల సంఘాల అభివృద్ధికి దోహదపడతానని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. మండలంలోని పొందుర్తి గ్రామంలో మాల కులస్తుల అభ్యర్థన మేరకు శుక్రవారం సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర
కామారెడ్డి ఎమ్మెల్యేకామారెడ్డి ఎమ్మెల్యే


కామారెడ్డి, 14 నవంబర్ (హి.స.)

కుల సంఘాల అభివృద్ధికి

దోహదపడతానని కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. మండలంలోని పొందుర్తి గ్రామంలో మాల కులస్తుల అభ్యర్థన మేరకు శుక్రవారం సంఘ భవనానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన సొంత నిధులతో కుల సంఘాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, కుల సంఘాలు ఆత్మగౌరవంతో బతికేలా కృషి చేయాలని నా కోరిక అని తెలిపారు. కుల సంఘాలు అభివృద్ధి చెందాలంటే మరింత బలోపేతం కావాలని సూచించారు.

కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క రూపాయి కుల సంఘాలకు సద్వినియోగం చేస్తానని, సమాజంలో కుల సంఘాల పాత్ర ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande