బిఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు.. మంత్రి సీతక్క
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు.
మంత్రి సీతక్క


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తిగా లోకల్, బీసీ సమాజానికి చెందిన, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావడం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్పై ఆడినా, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చినా, ఓటర్లు ప్రభావితం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande