జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు.. ప్రజల గెలుపు.. మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపు పూర్తిగా ప్రజలది, ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. జూబ్లీహ
మంత్రి శ్రీహరి


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. ఈ గెలుపు పూర్తిగా ప్రజలది, ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టమైందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్పై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ విజయం మరోసారి నిరూపించిందని, ఆ నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకునేలా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande