
మిజోరాం, 14 నవంబర్ (హి.స.) బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటూ దేశంలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ నేడు కొనసాగుతోంది. మిజోరం రాష్ట్రంలోని డంపా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్.లాల్తంగ్లిన విజయం సాధించారు. 6981 ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. నవంబర్ 11న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..