
వరంగల్, 14 నవంబర్ (హి.స.) ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం సాధ్యమవుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని బొల్లికొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే గృహప్రవేశానికి హాజరై ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ కుటుంబాల సొంతింటి నిర్మాణ కల సాకారమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉండి వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు