
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను బోయినపల్లి పోలీసులు,స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. ప్రేం కుమార్ రాయ్, మొహమ్మద్ నసీమ్ అలియాస్ నసీం లు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తూ జల్సాలకు అలవాటు పడ్డారు. నిందితులు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ నార్కోటిక్, బోయినపల్లి పోలీసులు వారిపై నిఘా పెట్టారు.
ఈ మేరకు నిందితులు బోయినపల్లి లోని కళ్యాణ్ థియేటర్ సమీపంలో గంజాయి విక్రయించనున్నారనే సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారి వాహనాన్ని అడ్డుకొని తనిఖీలు చేశారు. వారి వద్ద గంజాయి కలిగివున్న కొన్ని డబ్బాలు దొరికాయి. వారిని విచారించగా వారి వద్ద సుమారు కిలోన్నర గంజాయి ఉన్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. వారు దాచిపెట్టిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు