ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్
సిద్దిపేట, 14 నవంబర్ (హి.స.) వరి ధాన్యం తేమ శాతం రాగానే గన్నీ బ్యాగుల్లో నింపి మిల్లులకు తరలించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ఐకేపీ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. నారాయణ రావు పేట మండల పరిధిలోని జక్కాపూర్ ఐకేపీ సెంటర్ ను జిల్లా కలెక్ట
సిద్దిపేట కలెక్టర్


సిద్దిపేట, 14 నవంబర్ (హి.స.)

వరి ధాన్యం తేమ శాతం రాగానే గన్నీ బ్యాగుల్లో నింపి మిల్లులకు తరలించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి ఐకేపీ సెంటర్ సిబ్బందిని ఆదేశించారు. నారాయణ రావు పేట మండల పరిధిలోని జక్కాపూర్ ఐకేపీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తేమ శాతం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెంటర్ లో అన్ని వసతులు కల్పించాలన్నారు. కొనుగోలులో జాప్యం కాకుండా చూసుకోవాలి సిబ్బందిని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande