హైదరాబాద్ నగరంలో దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) హైదరాబాద్ వాతావరణం ఎవరూ ఉహించని స్థాయిలో పడిపోయింది. గురువారం రాత్రి నుంచే చలి తీవ్రత అధికం అయింది. శుక్రవారం ఉదయం చలి తీవ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చలికాలం ప్రారంభమైన రెండో వారంలోనే ఇంత కనిష్ఠ స్థాయిలో తీవ్ర చలి
చలి తీవ్రత


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ వాతావరణం ఎవరూ ఉహించని స్థాయిలో పడిపోయింది. గురువారం రాత్రి నుంచే చలి తీవ్రత అధికం అయింది. శుక్రవారం ఉదయం చలి తీవ్రత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చలికాలం ప్రారంభమైన రెండో వారంలోనే ఇంత కనిష్ఠ స్థాయిలో తీవ్ర చలిగాలి ప్రభావం కనిపించడం వాతావరణ నిపుణులు అంచనా అరుదుగా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU), శేర్లింగంపల్లి కేంద్రంలో అత్యల్పంగా 8.8°C ఉష్ణోగ్రతలు నమోదు కావడం నగర వాసులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ తీవ్రమైన చలిగాలి ప్రభావం మరో 3-4 రోజులపాటు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నవంబర్ తొలి వారాల్లో నమోదు కావడం చాలా అరుదైన విషయం.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande