ఓవైపు కౌంటింగ్ మరో వైపు ఓట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నిరసన
పాట్నా, 14 నవంబర్ (హి.స.) బిహార్‍లో ఓట్ల లెక్కింపు (Bihar Counting) కొనసాగుతోంది. మరోసారి ఎన్డీయే కూటమికే అక్కడి ఓటర్లు జై కొట్టారు. మెజార్టీ మార్క్ 122 స్థానాలను దాటుకుని ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బిహార్‍లో అధికారంల
congress-protests-against-vote-theft-in-bihar-494001


పాట్నా, 14 నవంబర్ (హి.స.) బిహార్‍లో ఓట్ల లెక్కింపు (Bihar Counting) కొనసాగుతోంది. మరోసారి ఎన్డీయే కూటమికే అక్కడి ఓటర్లు జై కొట్టారు. మెజార్టీ మార్క్ 122 స్థానాలను దాటుకుని ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే బిహార్‍లో అధికారంలోకి వస్తామని ఆశించిన కాంగ్రెస్ తో కూడిన మహాగఠ్ బంధన్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్డీయే కూటమికి కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోతోంది. ఈ క్రమంలో ఓ వైపు కౌంటింగ్ కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ నిరసనలకు (Congress protests) దిగింది. ఓట్ చోరీ (vote chori) అంటూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 65 లక్షల ఓట్లను, అందులో చాలా వరకు ప్రతిపక్ష ఓట్లను ఎస్ఐఆర్ పేరుతో తొలగించాక కౌంటింగ్ రోజు ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం అని ప్రశ్నించారు. ఇలా మ్యాచ్ కంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడితే ఇక ప్రజాస్వామ్య ఎలా మనుగడ సాధించగలదని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande