
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
న్యూ ఢిల్లీ/పట్నా02, నవంబర్ (హి.స.): రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీరుపై బీజేపీ మండిపడింది. ఇటీవల లాలూ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలోవీన్ (Halloween) పండుగను జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన మహా కుంభ్ మేళాను నాడు అర్థరహితం అని అభివర్ణించిన లాలూ యాదవ్, ఇప్పుడు ఒక పాశ్చాత్య పండుగను ఆనందంగా జరుపుకోవడం ఏమిటని బీజేపీ నిలదీసింది.
లాలూ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ మహిళా నేత రోహిణి ఆచార్య యాదవ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో హాలోవీన్ వేడుకల వీడియోలను పంచుకున్నారు. ‘అందరికీ హాలోవీన్ శుభాకాంక్షలు’ అని ఆమె ట్వీట్ చేశారు. ఆ వీడియోలలో లాలూ యాదవ్ తన మనవరాళ్లకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ వీడియో వైరల్ అయిన దరిమిలా.. లాలూ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, బీజేపీ కిసాన్ మోర్చా (బీజేపీకేఎం) ఘాటుగా స్పందించింది. ‘బీహార్ ప్రజలారా.. మర్చిపోవద్దు. నమ్మకం, ఆధ్యాత్మికతను వ్యర్థం అన్న లాలూ యాదవ్ ఇప్పుడు ఆంగ్లేయుల పండుగ హాలోవీన్ జరుపుకుంటున్నారు. నమ్మకంపై దాడి చేసే వారికి బీహార్ ప్రజలు ఓటు వేయరు’ అని ‘ఎక్స్’లో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ