హరి ముకుంద పండా 10 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు
పలాస,, 2 నవంబర్ (హి.స.) :ఆయనకు దైవభక్తి మెండు! దాతృత్వమూ ఎక్కువే! ఒక్కరూపాయి విరాళాలు సేకరించకుండా రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయనే... హరి ముకుంద పండా! శనివారం కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది ఆయన నిర్మించిన ఆలయంలోనే! కాశ
హరి ముకుంద పండా 10 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు


పలాస,, 2 నవంబర్ (హి.స.)

:ఆయనకు దైవభక్తి మెండు! దాతృత్వమూ ఎక్కువే! ఒక్కరూపాయి విరాళాలు సేకరించకుండా రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆయనే... హరి ముకుంద పండా! శనివారం కాశీబుగ్గలో విషాదం చోటు చేసుకుంది ఆయన నిర్మించిన ఆలయంలోనే! కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారి, రైతు హరి ముకుంద పండాకు చిన్నతనం నుంచే దైవభక్తి ఎక్కువ. ఆయన వయసు 95 సంవత్సరాలు. శ్రీదుర్గా కళామందిర్‌ను నెలకొల్పి సినీ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. స్థానిక చిన్నకలియాపండా నగర్‌లో దుర్గాదేవి ప్రఽధాన ఆలయంతోపాటు ఇతర ఉప ఆలయాలను నిర్మించారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో మరో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ‘

నేను నిత్యం ఆరాధించే దుర్గాదేవి కలలోకి వచ్చి వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని ఆదేశించారు’ అని చెప్పి 12.22 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఐదేళ్లకుపైగా పట్టింది. సుమారు రూ.10కోట్ల వరకూ వెచ్చించారు. ఇందులో శ్రీదేవి, భూదేవి సహిత విగ్రహాలతో పాటు మహాభారత, రామాయణ ఘట్టాలను తెలిపే వివిధ శిల్పాలను ఏర్పాటు చేశారు. వివిధ దేవతా విగ్రహాలను రాజస్థాన్‌, తిరుపతి నుంచి తీసుకుకొచ్చి ప్రతిష్ఠించారు. గతేడాది జూలైలో ఆలయాన్ని ప్రారంభించారు. స్థానికులు దీనిని ‘చిన్న తిరుపతి’గా పిలుచుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం జరడంతో జనం రాక కూడా పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande