
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
లఖ్‌నవూ:02, నవంబర్ (హి.స.)
నోరూరించే మక్ఖన్ మలాయ్...ఘుమ ఘుమలాడే అవధీ బిర్యానీ...మెత్తగా కరిగిపోయే గలౌటీ కబాబ్‌లు...రుచికరమైన చాట్, గోల్‌గప్పా... ఇలా పలురకాల అద్భుతమైన వంటకాలకు ప్రసిద్ధి చెందిన లఖ్‌నవూ నగరం అధికారికంగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్ (సీఎన్‌ఎన్) జాబితాలో చోటు దక్కించుకుంది. సీఎన్‌ఎన్‌లోని పాకశాస్త్ర నైపుణ్య(గ్యాస్ట్రోనమీ) విభాగంలో ఈ ఏడాది కొత్తగా 58 నగరాలకు ప్రవేశం కల్పించగా వాటిలో మన దేశానికి చెందిన లఖ్‌నవూ కూడా ఉంది. దీంతో ఈ నెట్‌వర్క్‌లో నగరాల సంఖ్య 408కి పెరిగింది. ఇవి 100 దేశాల పరిధిలో ఉన్నాయి. ‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ శతాబ్దాల నాటి సంప్రదాయ వంటలకు స్వర్గధామం’ అని భారత్‌లోని ఐక్యరాజ్యసమితి విభాగం ‘ఎక్స్’లో పేర్కొంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ