
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ, , నవంబర్ 02:(హి.స.)బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు తెలుస్తాయి. ఇదిలా ఉంటే, బీజేపీ గురించి తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు ప్రారంభించిన ‘‘Know BJP’’ ప్రచార కార్యక్రమంలో భాగంగా 7 దేశాలకు చెందిన దౌత్యవేత్తల బృందం ఆదివారం బీహార్ సందర్శిస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని పరిశీలించడానికి, భారతదేశ ప్రజాస్వామ్య, ఎన్నికల ప్రక్రియలపై అట్టడుగు స్థాయిలో అవగాహాన పొందడానికి దౌత్యవేత్తలు రెండు రోజుల పాటు బీహార్ లో పర్యటిస్తారు. ఈ ప్రతినిధి బృందంలో జపాన్, ఇండోనేషియా, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, భూటాన్, దక్షిణాఫ్రికా దేశాల రాయబార కార్యాలయాలు మరియు హైకమిషన్ల ప్రతినిధులు ఉన్నారు. దౌత్యవేత్తలు బీజేపీ నాయకులతో మాట్లాడుతారు. ప్రచార కార్యకలాపాలను గమనిస్తారు. పార్టీ ఓటర్లతో ఎలా కనెక్ట్ అవుతుందో గమనిస్తారు. పలు నియోజకవర్గాలను సందర్శిస్తారు.
‘‘బీజేపీ పనితీరు, ప్రచారం, సంస్థాగత బలం గురించి దౌత్యవేత్తలకు పరిచయం చేయడం, అలాగే అట్టడుగు స్థాయిలో భారత ఎన్నికలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం ఈ పర్యటన లక్ష్యం’’ అని ప్రకటన పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ