డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మా నాన్నను అరెస్ట్ చేశారు : రాజీవ్
అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామను అరెస్ట్ చేశారు. తన తండ్రి అరెస్టుపై కొడుకు రాజీవ్ స్పందించారు. సీఎం చంద్ర
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే మా నాన్నను అరెస్ట్ చేశారు : రాజీవ్


అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామను అరెస్ట్ చేశారు. తన తండ్రి అరెస్టుపై కొడుకు రాజీవ్ స్పందించారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. లేదంటే నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టు ఈరోజే చేయాలని డిమాండ్ చేశారు.

తమపై కక్షసాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి అరెస్టులుచేసిందన్నారు. గతేడాది తనను, ఇప్పపుడు తనతండ్రి,బాబాయ్ లను కూడా అరెస్ట్ చేశారని, ఇందుకు తగిన ఫలితం అనుభవిస్తారన్నారు. అక్రమ అరెస్టులు ఎల్లకాలం సాగవని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు. కూటమికి అధికారమేమీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande