పేరుకే డబుల్‌ ఇంజిన్‌-నడిపేది దిల్లీ నుంచే: ప్రియాంక
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala
Priyanka Gandhi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}బెగుసరాయ్‌/ ఢిల్లీ, , నవంబర్ 02:(హి.స.): బిహార్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పేరుకేనని, నిజానికి ప్రతిదాన్ని దిల్లీ నుంచి నియంత్రిస్తారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. దీనివల్ల ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌కు, బిహార్‌ ప్రజలకు గౌరవం దక్కడం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్‌లో తన తొలి ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పేరుతో మరోసారి వంచించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని, ఆ వలలో పడొద్దని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. ‘‘డిమాండ్లు వినిపించడానికి బిహార్‌ ప్రజలకు సరైన వేదికే లేదు. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ కూడా గౌరవం పొందట్లేదు. రాష్ట్రంలో ప్రస్తుత సమస్యలకు నెహ్రూ-ఇందిరలే కారణమని నిందించడానికే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తమ సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. ఇప్పుడు కోటి ఉద్యోగాల పేరుతో ప్రజల్ని మోసగించాలని చూస్తున్నారు. ఇన్నాళ్లూ ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మందిని తీసేయడం ద్వారా వారెవరికీ హక్కుల్లేకుండా చేశారు. ఓటుహక్కును రాజ్యాంగం కల్పించింది. దానిని తీసేయడమంటే పౌరుల హక్కుల్ని నిరాకరించడమే’’ అని చెప్పారు. ఎవరైనా డబ్బులతో ప్రలోభపెట్టాలనుకున్నా ఆ డబ్బ

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande