
విజయవాడ, 2 నవంబర్ (హి.స.)లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను తీసుకువెళుతున్న సమయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు తనను కక్ష గట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని భార్యా బిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసి చెప్పానని అన్నారు. అయినప్పటికీ తనను అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఉదయం 5గంటలకే రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు.
ఈ క్రమంలో ఆయన ఇంటివద్ద హైడ్రామా నడిచింది. అధికారులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా జోగి రమేష్ ఖండించారు. హైడ్రామా నడుమ రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో నకిలీ మద్యం కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరింది. ఈ కేసులో ఆయన్ను ఏ18గా చేర్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV