ట్రంప్‌ది టారిఫ్‌ టెర్రరిజం: బాబా రామ్‌దేవ్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
మలేసియాలో మోదీ- ట్రంప్‌ భేటీ లేదు


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ, , నవంబర్ 02:(హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్‌ (Baba Ramdev) తీవ్రంగా విమర్శించారు. దానిని టారిఫ్‌ టెర్రరిజంగా అభివర్ణించారు. మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితుల్లో దానిని ఆర్థిక యుద్ధంగా పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలన్న విధానం ఆర్థిక యుద్ధానికి సరైన సమాధానం అవుతుందా..? అన్న ప్రశ్నపై రామ్‌దేవ్‌ స్పందించారు. ట్రంప్‌ అనుసరించే సామ్రాజ్యవాద, విస్తారవాద పోకడలతో పోలిస్తే.. స్వేదేశీ ఉద్యమం మెరుగైందన్నారు. సమష్టిగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైందని చెప్పారు.

‘‘టారిఫ్‌ టెర్రరిజం అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ఉంటే.. అది ఈ ఆర్థిక యుద్ధమే. దీనిలోనైనా.. కనీసం పేద దేశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అధికారంలో ఉన్న వారు సామ్రాజ్యవాద, విస్తరణ పోకడలకు పోతున్నారు’’ అని వెల్లడించారు.

ప్రపంచంలో శక్తి అతికొద్ది మంది వ్యక్తుల చేతిలోనే కేంద్రీకృతం కావాడాన్ని బాబా రామ్‌దేవ్‌ విమర్శించారు. ప్రతి ఒక్కరు తమ హద్దుల్లో ఉండాలని.. సాటి మనిషిని పైకి తీసుకురావాలని పేర్కొన్నారు. స్వదేశీ అనే నినాదం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంసమృద్ధి సాధించడమేనని అభివర్ణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande