
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ, , నవంబర్ 02:(హి.స.)భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (General Upendra Dwivedi) పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని.. పాత సమస్యలు పరష్కరించుకునేలోపే కొత్తవి వస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య.. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఈ రోజు ఏం చేస్తున్నారు.. రేపు ఏం చేయబోతున్నారు..? అనే విషయం ఆయనకు కూడా తెలియకపోవచ్చని ద్వివేది వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన ద్వివేదీ మాట్లాడుతూ.. గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం కోసం చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని.. ప్రస్తుతం కొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాయని అన్నారు. ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాల వంటి సవాళ్లను మన సైన్యం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము కేవలం పాక్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని.. అయితే ఆ దేశ పౌరుల పైనా దాడులకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని అన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ