ప్రపంచ తెలుగు మహాసభలకు తేదీలు ఖరారు
అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించబడతాయి. ఇందులో భాగం
world-telugu-conference-dates-fixed-with-tripura-governor-to-attend


అమరావతి, 2 నవంబర్ (హి.స.)ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరు వేదికగా ఈ మహాసభలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా జనవరి 4న జరిగే తెలుగు వైభవ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు అంగీకరించారు.

ఈ మేరకు పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని ఇంద్రసేనారెడ్డి హామీ ఇచ్చారన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, మాతృభాష అయిన తెలుగును నిలబెట్టుకోవడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని గుర్తుచేశారు. కాగా, గుంటూరులోని అమరావతి శ్రీసత్య సాయి స్పిరుచ్యువల్‌ సిటీ ప్రాంగణంలో (హైవే) ఉన్న నందమూరి తారకరామారావు వేదికపై ఈ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande