
హుజురాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొక్కొండ రమేష్-రజితల పెద్ద కుమారుడు అభిలాష్ (19) శుక్రవారం తన ఇంట్లో బాత్రూంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అభిలాష్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడు సింగాపురం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు