
వరంగల్, 5 డిసెంబర్ (హి.స.)
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో
భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.508 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. నర్సంపేట-నెక్కొండ 4 లేన్ల రోడ్డు నిర్మాణం, హనుమకొండ-మహబూబాబాద్ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతో పాటు నర్సంపేటలో నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు