ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్ వార్తలు అవాస్తవం.. సైబర్ క్రైమ్ డీసీపీ
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సమయంలో రవికి జాబ్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించాడని ప్రచారం జరిగింది. అంతేకాకుండా బైయిల్ పై బయటకు వచ్చిన తరవాత కరేబియన్ దీవుల
సైబర్ క్రైమ్ డీసీపీ


హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

ఐబొమ్మ రవికి పోలీసులు జాబ్ ఆఫర్

చేశారు అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సమయంలో రవికి జాబ్ ఆఫర్ చేయగా సున్నితంగా తిరస్కరించాడని ప్రచారం జరిగింది. అంతేకాకుండా బైయిల్ పై బయటకు వచ్చిన తరవాత కరేబియన్ దీవుల్లో రెస్టారెంట్ ప్రారంభిస్తానని రవి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. రవికి జాబ్ ఆఫర్ చేశామని చెప్పడం అవాస్తవం అని కొట్టిపారేశారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవ కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చాడని వెల్లడించారు.

తప్పు చేశానన్న బాధ రవిలో అసలే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రవి మూడు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్టు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande