విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి: డీజీపీ శివధర్ రెడ్డి
ఆదిలాబాద్, 5 డిసెంబర్ (హి.స.) విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన బ్రీఫింగ్ హాల్, క
డిజిపి


ఆదిలాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది

క్రమశిక్షణ, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన బ్రీఫింగ్ హాల్, క్లాస్ రూమ్ ను మల్టీ జోన్ వన్ ఐజి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. సిబ్బందికి శిక్షణలు ఇచ్చేందుకు, బందోబస్తు సూచనలు చేసే సమయంలో ఉపయోగపడేలా వీటి నిర్మాణం చేపట్టడం జరిగిందని డీజీపీ పేర్కొన్నారు.

ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ సిబ్బందికి శిక్షణ సమయంలో ఈ భవనం ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. అనంతరం పరిసరాలను పరిశీలించి క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande