గ్లోబల్ సమ్మిట్కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని ఆహ్వానించిన భట్టి విక్రమార్క
ఝార్ఖండ్, 5 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకం
బట్టి విక్రమార్క


ఝార్ఖండ్, 5 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్

సమ్మిట్కు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం హేమంత్ సోరెన్కి అందజేశారు.

నీతి ఆయోగ్ సలహాలు, నిపుణుల మేథోమథనం, పలు కార్యాచరణ రంగాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ను హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande