
అమరావతి, 5 డిసెంబర్ (హి.స.)
తిరుమల: తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేపింది. తితిదే మూడంచెల భద్రతను దాటుకొని ఓ భక్తుడు ఆ కెమెరాతో వచ్చాడు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటి వచ్చి తిరుమలలోని శిలాతోరణం వద్ద భక్తులు, భద్రతా సిబ్బంది ఉండగానే దాన్ని ఎగురవేశాడు. గమనించిన భక్తులు.. విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే విజిలెన్స్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ కెమెరా ఎగురవేసిన వ్యక్తిని ప్రవాస భారతీయుడిగా గుర్తించారు. అందులో రికార్డయిన దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం అతడిని పోలీసులకు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ