
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
అంబర్పేటలోని బతుకమ్మకుంట
పరిరక్షణకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ఉల్లంఘనతో తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రంగనాథ్ ధర్మాసనం ఎదుట క్షమాపణలు చెప్పారు. కోర్టు ఆదేశాలు తెలియకుండానే పనులు జరిగాయని, ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని ఆయన సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. రంగనాథ్ పూర్తి వాదనలను విన్న తర్వాత ధర్మాసనం ఆయన క్షమాపణను రికార్డు చేసుకుంటూ కంటెంప్ట్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే, ఈ కేసులో ఇతర అంశాలపై తదుపరి విచారణకు ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..