సీఎం ఆదేశిస్తే వెంటనే రాజీనామాకు సిద్ధం.. ఎమ్మెల్యే దానం నాగేందర్
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు
దానం నాగేందర్


హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై

సమాధానం ఇచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇటీవలే ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తన రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఇప్పటికిప్పుడు తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడం.. పోరాడటం తనకేమీ కొత్త కాదని దానం కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande