మిడ్ మానేరు స్పీడ్ బోట్లో ప్రయాణించిన మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, 5 డిసెంబర్ (హి.స.) మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల
మంత్రి పొన్నం


రాజన్న సిరిసిల్ల, 5 డిసెంబర్ (హి.స.)

మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్

ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండలం వరదవల్లి శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లేందుకు వీరు మిడ్ మానేరులో స్పీడ్ బోట్ లో ప్రయాణం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande