విద్యార్థుల స్కాలర్షిప్ ల మంజూరు పై సమీక్షించిన నల్గొండ జిల్లా కలెక్టర్
నల్గొండ, 5 డిసెంబర్ (హి.స.) ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 5 డిసెంబర్ (హి.స.)

ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ ల దరఖాస్తులు 30 శాతం దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు. ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కులం ధ్రువపత్రం విషయంలో తహసిల్దార్లు జాప్యం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande