నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్
నిజామాబాద్, 5 డిసెంబర్ (హి.స.) మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి, చౌటుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా శుక్రవారం ఆక
సబ్ కలెక్టర్


నిజామాబాద్, 5 డిసెంబర్ (హి.స.)

మూడవ విడత స్థానిక సంస్థల

ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి, చౌటుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరి రోజున కాబట్టి అభ్యర్థులకు, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande