
నిజామాబాద్, 5 డిసెంబర్ (హి.స)
లంచం అనేది సమాజాన్ని పూర్తిగా
దెబ్బతీస్తుందని, లంచం తీసుకోవడం పెద్ద నేరమని, లంచానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య అన్నారు. అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏసీబీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో లంచానికి వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని సీపీ సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా లంచం అడుగుతే అలాంటి వారిపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ ఆధ్వర్యంలో క్యూఆర్ కోడ్ పద్ధతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు