పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ ఆలయం.వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు అందక ఇబ్బంది
అమరావతి, 5 డిసెంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఉద్యోగుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు అడుగడుగునా
పెనుగంచిప్రోలు లోని శ్రీ తిరుపతమ్మ ఆలయం.వద్ద భక్తులకు కనీస సౌకర్యాలు అందక ఇబ్బంది


అమరావతి, 5 డిసెంబర్ (హి.స.)

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన పెనుగంచిప్రోలులోని శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులు కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ఉద్యోగుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుందామని ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులకు నిరాశే మిగులుతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలపై నిర్వహించిన సమీక్షలోనూ పెనుగంచిప్రోలు శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులకు అందించే సేవల్లో చివరి స్థానంలో ఉంది. దీంతో ఆలయ అధికారి కిశోర్‌కుమార్‌ను దీర్ఘకాలిక సెలవుపై పంపించారు. అధికారులున్నా.. రెండు, మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. ఒకరిద్దరు ఉద్యోగులు చెప్పిన మాటలతోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారని, దీంతో దిగువ స్థాయిలో ఉద్యోగులు భక్తులకు సేవలందించడంపై దృష్టి సారించట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande