
సూర్యాపేట, 5 డిసెంబర్ (హి.స.) ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై విలేకరులతో ఆయన మాట్లాడారు. కోదాడ డివిజన్ పరిధిలో ఇతర రాష్ట్రాల నుండి అనుమతులు లేకుండా ధాన్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. . పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు