
వరంగల్, 5 డిసెంబర్ (హి.స.)
నర్సంపేటలో ముఖ్యమంత్రి రేవంత్
రెడ్డి పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ సమస్యల పైన, నిలిచిపోయిన అభివృద్ధి పనులపై, రద్దు చేసిన నిధుల గురించి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి గాని, ప్రభుత్వం గాని బహిరంగ లేఖకు ఎలాంటి సమాధానం చెప్పలేక పోలీసులతో తనను హౌస్ అరెస్టు చేయించినట్లు పెద్ది ఆరోపించారు.ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నియోజవర్గ వ్యాప్తంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు