
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.) ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కి మరో షాక్ తగిలింది. యస్ బ్యాంక్ ను మోసం కేసులో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్కు చెందిన రూ.1,120 కోట్ల ఆస్తులను ఈడి తాజాగా అటాచ్డ్ చేసింది. ఇందులో 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్ హోల్డింగ్ వంటివి ఉన్నాయి.
కాగా, మనీలాండరింగ్కు సంబంధించి ఇప్పటికే రూ.8,997 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా చర్యతో వాటి విలువ మొత్తం రూ.10 వేల కోట్లకు పైగానే ఉంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..