
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బోర్డు
అధికారులు శుక్రవారం పలు అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు. సిఖ్ విలేజ్ లోని భాంటియా ఫర్నిచర్ సమీపంలోని బంగ్లా నెంబర్ 207/ఎ లో ఉన్న పలు అక్రమ కట్టడాలను కంటోన్మెంట్ బోర్డు అధికారులు సిబ్బంది కూల్చి వేశారు. బోర్డుకు అనుకూలంగా కోర్టులో తీర్పు రావడంతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం.
కంటోన్మెంట్ బోర్డు కు చెందిన బంగ్లా స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని బోర్డు నిబంధనలు ఉన్నపటికీ కొంతమంది వ్యాపారాలకు దొడ్డిదారిన ఉపయోగిస్తుండడంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే బంగ్లా ఏరియాను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అధికారులు లోపల ఉన్న సామాగ్రితో పాటు కార్లను తొలగించి కూల్చివేతలు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..