
హైదరాబాద్, 5 డిసెంబర్ (హి.స.)
స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన హిల్ట్ పాలసీపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు నేడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీవో నిబంధనలకు విరుద్ధం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ , పర్యావరణవేత్త పురుశోత్తం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూకేటాయింపు అంశంపై సీబీఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని కోరారు. ఈ పిల్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..